‘అన్నయ్య’ను కలిసిన ‘తమ్ముడు’.. మధ్యలో నాదెండ్ల!!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును చాలా రోజుల తర్వాత ‘అన్నయ్య’ మెగాస్టార్ చిరంజీవిని.. ‘తమ్ముడు’ పవన్ కల్యాణ్ కలిశారు. అయితే వీరిద్ధరి మధ్య భేటీకి జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ కీలకపాత్ర పోషించారని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఇదివరకు చిరు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు రావడంతో నాదెండ్ల మధ్యవర్తిత్వం వహించి కలిపారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి వీరిద్దర్ని నాదెండ్ల ఒక్కటి చేశారన్న మాట.
కీలక చర్చ..!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాదు తదుపరి చిత్రానికి చిరు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న చిరును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీకి చెందిన కీలక నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. సుమారు అరగంటకు పైగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు విషయాలుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం నాదెండ్ల తన ట్విట్టర్‌లో ఫొటోతో పాటు పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
నాదెండ్ల ట్వీట్ సారాంశం!!
"పవన్ కల్యాణ్ గారు, నేను.. సైరా నరసింహారెడ్డి (చిరంజీవి గారి)ని కలుసుకున్నాం. ఈ సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. ఈ భేటీలో మేం చాలా అంశాలపై చర్చించాం. ఆయన జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. చిరంజీవిగారు మరిన్ని విజయాలు సాధించాలి. ఇలాంటి సమావేశాలు మళ్లీమళ్లీ జరగాలని కోరుకుంటున్నాను" అని నాదెండ్ల తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. దీంతో పాటు ముగ్గురు కలిసి దిగిన ఫొటోను కూడా నాదెండ్ల షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు మెగాభిమానులు, నాదెండ్ల ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ కామెంట్స్, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments