రెండు సినిమాలతో పవన్ సంగీత దర్శకుడి సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
జల్సా, అత్తారింటికి దారేది వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తెలుగు పరిశ్రమకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.
అదే సీజన్లో అనిరుద్ సంగీతమందిస్తున్న మరో చిత్రం రిలీజ్ కానుంది. అదే సూర్య, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం తానే సేరంద కూట్టమ్. తెలుగులోనూ ఈ చిత్రం డబ్ అయ్యే అవకాశముంది. సో.. అన్నీ కుదిరితే సంక్రాంతికి అనిరుద్ డబుల్ ధమాకా ఇచ్చే అవకాశముందన్న మాట. అన్నట్టు..పవన్ 25వ చిత్రం కోసం అనిరుద్ ఇచ్చిన మ్యూజికల్ సర్ప్రైజ్ మెగాభిమానులని అలరిస్తోంది. పాటలపైనా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com