పవన్ సినిమా టైటిల్....?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి చిత్రానికి రంగం సిద్ధమవుతుంది. గోపాల గోపాల ఫేమ్ కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మించనున్నారు. శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. సెప్టెంబర్ మొదటివారం నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభానికి సన్నాహాలు జరగుతున్నాయి. ఈ సినిమా చిత్రీకరణతో పాటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసేలా పవన్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి కాటమరాయుడు అనే పేరు పరిశీలనలో ఉందని వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, శృతిహాసన్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథా చిత్రం అని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com