పవన్ ఈరోజే మూవీ ప్రారంభించడానికి కారణం ఇదే...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య తో చేసే సినిమాని ఈ నెల 29న ప్రారంభించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ..ఊహించని విధంగా ఈరోజు ఉదయం పవన్ కొత్త సినిమాని ప్రారంభించారు. నిర్మాత శరత్ మరార్ కొత్త ఆఫీస్ లో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు. అయితే...పవన్ ఈరోజే తన న్యూమూవీ స్టార్ట్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. అదేమిటంటే...పవన్ కళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఖుషీ
ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సంచలన చిత్రం ఖుషీ రిలీజై నేటికి సరిగ్గా 15 సంవత్సరాలు అయ్యింది. అందుకనే ఖుషీ రిలీజైన ఈరోజునే ఎస్.జె.సూర్యతో చేసే చిత్రాన్ని ప్రారంభించారట పవన్. ఇది...ఈరోజే పవన్ కొత్త సినిమాని ప్రారంభించడానికి వెనకున్నఅసలు కారణం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments