సంక్రాంతి బరిలో నిలవనున్న పవన్!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాతో పాటు పవన్ మరో సినిమాను చేస్తున్నప్పటికీ ప్రేక్షకుల దృష్టి మాత్రం ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎన్ని వచ్చినప్పటికీ అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు న్యూ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతే మరి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తాజాగా తెలిసింది.
ఈ సినిమా 2022లో సంక్రాంతి కానుకగా 2022లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఏఎం రత్నం అధికారికంగా వెల్లడించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పిరియాడిక్ మూవీలో నటించడం పవన్‌కు ఇదే తొలిసారి అయితే ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుండటం మరో విశేషం. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు కాలానికి చెందిన కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ పేద ప్రజలకు అండగా నిలబడే బందిపోటు పాత్రలో కనిపిస్తాడు. ఈ విశేషాలన్నింటి కారణంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం గండిపేట ప్రాంతాన్ని, భారీ చార్మినార్ సెట్‌ను చిత్ర యూనిట్ నిర్మించింది. ప్రస్తుతం ఈ సెట్‌లోనే షూటింగ్ జరుగుతోంది. నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జౌరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి పోటీలో సూపర్‌స్టార్ మహేశ్ 'సర్కారువారి పాట' సినిమా కూడా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com