చిరు ఇంటికి ప‌వ‌న్

  • IndiaGlitz, [Monday,October 19 2015]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్యపాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే బ్రూస్ లీ సినిమా స‌క్సెస్ అయినందుకు అబ్బాయ్ చ‌ర‌ణ్ ని బాబాయ్ ప‌వ‌న్ నిన్న అభినందించారు. ఈరోజు అన్న‌య్య చిరంజీవిని అభినందించేందుకు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా ఇంటికి వెళ్ల‌డం విశేషం. చిరు 60వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల స‌మ‌క్షంలో ఏర్పాటు చేసిన మెగా ఫంక్ష‌న్ కి వెళ్ల‌ని ప‌వ‌న్ ఇప్పుడు బ్రూస్ లీ సినిమా విష‌యంలో చిరు ఇంటికి వెళ్ల‌డం ఆస‌క్తిగా మారింది.

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా అన్న‌య్య చిరంజీవి ఇంటికి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లారు. బాబాయ్ ప‌వ‌న్ కి అబ్బాయ్ చర‌ణ్ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ..నేను సినిమాల్లో రావ‌డానికి స్పూర్తి అన్న‌య్య‌. ఆయ‌న చాలా రోజుల త‌ర్వాత బ్రూస్ లీ లో న‌టించ‌డం నాకు వ్య‌క్తిగ‌తంగా చాలా ఆనందం క‌లిగించింది. అందుకే అన్న‌య్య‌ను క‌ల‌సి శుభాకాంక్ష‌లు తెలియ‌చేసాను. అలాగే అన్న‌య్య 150వ సినిమా మ‌రింత విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. రాజ‌కీయంగా విధానాలు వేరైనా సినిమా ప‌రంగా, కుటుంబ‌ప‌రంగా అన్న‌య్య అంటే గౌర‌వం ఉంటుంది అన్నారు.