జనసేన పటిష్టానికి పవన్ చర్యలు.. నాగబాబుకు కీలక బాధ్యతలు
- IndiaGlitz, [Friday,July 26 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిని చవిచూశాక.. రానున్న ఎన్నికల్లో అయినా రాణించి పార్టీ సత్తా ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుం బిగించారు. ఈ నేపథ్యంలో కీలక నేత నాదెండ్ల మనోహర్ చైర్మన్‌గా 12 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని రూపొందించడం జరిగింది. ఈ కమిటీతో పాటు నలుగురు సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటన తెలిపింది. ఇదిలా ఉంటే.. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమిస్తున్నట్లు జనసేనాని స్పష్టం చేశారు.
పొలిటిబ్యూరోలో ఉన్నదెవరు..!?
నాదెండ్ల మనోహర్
రాజు రవితేజ్
పి.రామ్మోహన్రావు
అర్హంఖాన్
పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నదెవరు!?
కొణిదెల నాగబాబు
రాపాక వరప్రసాద్
కోన తాతారావు
పాలవలస యశస్విని
మనుక్రాంత్‌రెడ్డి
బి. నాయకర్
తోట చంద్రశేఖర్
కందుల దుర్గేష్
ముత్తా శశిధర్
పసుపులేటి హరిప్రసాద్
ఎ. భరత్ భూషణ్‌లు ఈ కమిటీలో ఉన్నారు.
కాగా.. జనసేన పార్టీ గమనానికి పొలిటికల్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీలు కీలకం కానున్నాయి. శ్రేణులకు దిశానిర్దేశం చేయగలిగే సమర్థ నాయకత్వ పటిమ, రాజకీయ, సామాజిక, పాలన వ్యవహారాలపై ఉన్న సాధికారత, ప్రజా సమస్యలను కూలంకషంగా పరిశీలించే ఆలోచన, బాధ్యతాయుత దృక్పథం ఉన్నవారికే ఈ కమిటిలో స్థానం కల్పించినట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా జనసేన పార్టీ శ్రేణులతో మమేకం కావడంతో సహనశీలత కలిగినవారికి ప్రాధాన్యం ఇస్తారు.