మొన్న పవన్ - నిన్న మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
మొన్న పవన్ - నిన్న మహేష్...ఇంతకీ విషయం ఏమిటంటే....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఖుషీ. ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఖుషీ తర్వాత పవన్ - సూర్య కలసి పులి సినిమా చేసారు. ఇప్పుడు పవన్ - సూర్య కలసి మూడో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీని ఖుషీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజును ప్రారంభించారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పోకిరి. ఈ సంచలన చిత్రం తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. పోకిరి తర్వాత మహేష్ - పూరి చేసిన రెండో చిత్రం బిజినెస్ మేన్. ఈ చిత్రం కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మహేష్ - పూరి కలసి మూడవ చిత్రం చేస్తున్నారు. పోకిరి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ - పూరి హ్యాట్రిక్ ఫిల్మ్ జనగణమన అంటూ టైటిల్ ఎనౌన్స్ చేసారు.
ఖుషీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజున పవన్ - ఎస్.జె సూర్యల మూడవ చిత్రాన్ని ప్రారంభించడం ఓ విశేషమైతే...పోకిరి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజున మహేష్ - పూరి ల మూడవ చిత్రం జనగణమన అంటూ టైటిల్ ఎనౌన్స్ చేయడం మరో విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com