Tamil »
Cinema News »
మన భాషని, యాసని మరచిపోకూడదు అందుకే సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రొత్సహిస్తాను-UKTA 6 వ వార్షికోత్సవంలో పవన్
మన భాషని, యాసని మరచిపోకూడదు అందుకే సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రొత్సహిస్తాను-UKTA 6 వ వార్షికోత్సవంలో పవన్
Monday, July 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ (UKTA) ఆరవ వార్షికోత్సవ వేడుకలు జయతే కూచిపూడి, జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సి లో ఘనంగా నిర్వహించారు. సుమారు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారు (UKTA) గురించి వివరిస్తూ రచించిన పద్యగానంతో ఆరంభించారు. అనంతరం నాట్యారామం బృందం ప్రదర్శించిన దశావతారం మహిషాసురమర్ధిని, యక్షగానం (భామా కలాపం, గాయత్రీ వనమాలి, భక్త ప్రహ్లాద) ఆద్యంతం రసవత్తరంగా సాగుతూ వీక్షకుల మదిని దోచుకున్నాయి.
అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ కళాకారులకు జ్ఞాపికలను అందచేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సాంస్కృతిక ఉత్సవాలు వాటి ప్రయోజనాలు గురించి మాట్లాడుతూ...కళ మనకు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ మనస్సుకు ఆహ్లాదాన్నికలిగించేదిగా ఉండాలి అని చెప్పారు.కళ అనేది సంస్కృతిలో అంతర్భాగం అని, మన భాషని, యాసని మరచిపోకూడదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రొత్సహిస్తానని, వివిధ తెలుగు ప్రాంతాల జానపత గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని జానపదం గురించి ప్రస్తావించి చెప్పారు. తెలుగు సంప్రదాయలను భావితరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయపడ్డారు.UKTA తలపెట్టిన ఈ మహా ఉద్యమంలో పాల్గొన్న కళాకారుల్ని, విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులను కళల పట్ల ఆసక్తితో విచ్చేసిన ప్రేక్షకులను అభినందించారు. తెలుగు సంస్కృతి మరియు కళలను భావితరాల వారికి అందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, దీనికి ప్రవాస ఆంధ్రులు చేస్తున్న కృషిని కొనియాడారు.
శ్రీ వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జానపద నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా శ్రీ వడ్డేపల్లి మాట్లాడుతూ...ఆంధ్ర, తెలంగాణలో 200 పై చిలుకు జానపద నృత్య, గేయ మరియు నాటక కళారూపాలు ఉన్నాయని వీటి ముఖ్య ఉద్దేశ్యం మానసిక ఉల్లాసం అని పేర్కొన్నారు. ప్రసాద్ మంత్రాల UKTA వ్యాపార కార్యదర్శి పాల్గొన్న కళాకారులకు, సమర్పకులకు కృతజ్ఞతలు తెలిపి ఈ కార్యక్రమం ఘన విజయం వెనక ఉన్న UKTA కార్యవర్గం కృషి, పట్టుదల మొండితనం కారణమని, నరేంద్ర మున్నులూరి, కృష్ణ యలమంచిలి, ఉదయ్ అరేటి, అమర్ రెడ్డి, బలరామ్ విష్ణు, రాజ్ కూర్బ, ఆదిత్య అల్లాడి, పూర్ణిమ రెడ్డి పద్మ కిల్లి, గీత మోర్ల, భాను ప్రకాష్ లను పేరు పేరున అభినందించారు. UKTA ఛైర్మెన్ శ్రీ కిల్లి సత్యప్రసాద్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ వయసు భేదం లేకుండా తెలుగు వారి కోసం చేస్తున్న కృషి గురించి వివరించి భవిష్యత్ లో ఇంకా ఎన్నోశిఖరాలను అధిరోహిస్తామని ఆశాభావం వ్యక్తం పరుస్తూ వందన సమర్పణ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments