Pawan Kalyan:ఇకపై నో హైదరాబాద్.. అంతా మంగళగిరి నుంచే , జనసేన కేంద్ర కార్యాలయ నిర్మాణానికి పవన్ భూమి పూజ

  • IndiaGlitz, [Monday,June 12 2023]

మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. అనంతరం భూమాత ప్రీత్యర్థం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను వేద పండితుల పర్యవేక్షణలో చేపట్టారు.

కాగా.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి సాగుతున్నాయి. అయితే ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి ఆయన ఈరోజు భూమి పూజ నిర్వహించారు. కార్యాలయ నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ నిపుణులకు పవన్ సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మపరిరక్షణ, ప్రజా క్షేమమే లక్ష్యం :

అంతకుముందు ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు పవన్ కల్యాణ్. సోమవారం ఉదయం 6.55 నిమిషాలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

రేపు కూడా కొనసాగనున్న యాగం :

యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి.. శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అఫ్లైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదుగురు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా సోమవారం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జనసేన కార్యాలయం వద్ద ఆధ్యాత్మిక శోభ:

ఇకపోతే.. మంగళగిరి జనసేన కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. అక్కడ సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. ఈ యాగంలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోంది.

More News

Pawan Kalyan:మంగళగిరి జనసేన కార్యాలయంలో హోమం .. సాంప్రదాయ వస్త్రధారణలో పవన్‌, యాగశాలలో దీక్ష

సినిమాలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సనాతన ధర్మం, భారతీయ ఆచార వ్యవహారాలపై

Nadendla Manohar:హెలికాఫ్టర్‌లో చక్కర్లు , పరదాల మాటున పర్యటనలు.. జనానికి కరెంట్ షాక్‌లు : జగన్‌ పాలన‌పై నాదెండ్ల సెటైర్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలికి చెందిన పలువురు నాదెండ్ల సమక్షంలో

Election Commission:ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం.. ఏ రోజున ఏం చేస్తారు, షెడ్యూల్ ఇదే..!!

సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టేసింది.

Vimanam:మంచి కంటెంట్ చిత్రాల‌ను ఆద‌రిస్తామ‌ని 'విమానం' సినిమాతో నిరూపించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: స‌ముద్ర ఖ‌ని

సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ‌, ధ‌న‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’.

Dog killed:జింక మాంసమని ఎగబడికొన్న జనం.. కట్ చేస్తే ఆ వూళ్లో కుక్క మిస్, ఎలా బయటపడిందంటే..?

ఇటీవలి కాలంలో కేటుగాళ్లు సులభంగా డబ్బులు సంపాదించేందుకు అందుబాటులో వున్న అన్ని రకాల మార్గాలను వాడేస్తున్నారు.