పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ 'చల్ మోహన్ రంగ' ఫస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ 'చల్ మోహన్ రంగ' ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్ఫయి నిమిషాలకు విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. నా అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం ప్రచార చిత్రాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు హీరో నితిన్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఏంటో సంతోషంగాఉంది. ఆయనకు మా తరపున చిత్రం యూనిట్ తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు అన్నారు. చిత్రం టీజర్ ను ప్రేమికులరోజు అయిన ఈ నెల 14న, చిత్రం ను ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మిగిలిన ఒక్క గీతాన్ని ఈ నెల 14 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించనున్నామని తెలిపారు. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..' ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు.
నా ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఆనందంగా ఉందని, కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com