'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ మనసే' గీతాన్ని విడుదల చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికెట్ ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న 'మిస్ మ్యాచ్' ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు.
'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ..మనసే' పాట ను ఈరోజు విడుదల చేసారు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ... నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు 'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ మనసే' గీతాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు. నా మొదటి సినిమా 'ఆట కదరా శివ' సినిమా లోని గీతాన్ని గతంలో పవన్మ కళ్యాణ్ గారు విడుదల చేసి ఆశీర్వదించారు. ఆ చిత్రం నటుడుగా నాకుగుర్తింపును తెచ్చింది. ఆయన నటించిన 'తొలిప్రేమ' చిత్రం ఆరోజుల్లో ఎంతో ఘనవిజయం సాధించింది. ఆ చిత్రంలోని 'ఈ మనసే' పాటను ఈ 'మిస్ మ్యాచ్' లో నాపై చిత్రీకరించటం ఎంతో సంతోషంగా ఉంది. ఒకటే షాట్ గా ఈ పాట చిత్రీకరించటం మరో విశేషం. అలాంటి ఈ గీతం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల అవటం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.
మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ...సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ పాట విడుదలవ్వడం సంతోషం. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నాను" అన్నారు.
ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments