మూడ్రోజులపాటు కర్నూల్లో జనసేనాని పర్యటన
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచారు. ఇప్పటికే కోస్తాంధ్రలో అన్ని జిల్లాల్లో పర్యటించిన ఆయన రాయలసీమలో పర్యటించిన అభిమానులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ పర్యటనకుగాను షెడ్యూల్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
పర్యటన సాగనుందిలా..
తొలి రోజు కర్నూలు నగరంలో రోడ్ షో జరగనుంది. మహిళల సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చించనున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చర్చా కార్యక్రమంలో సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధి స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 25న ఆదోనిలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా పవన్ పత్తి రైతులను కలసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. చివరి రోజు అనగా.. 26వ తేదీన ఆళ్ళగడ్డలో జనసేనాని పర్యటించనున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా పలువురు వైసీపీ, టీడీపీ అసంతృప్తులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout