మూడ్రోజులపాటు కర్నూల్‌‌లో జనసేనాని పర్యటన

  • IndiaGlitz, [Friday,February 22 2019]

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచారు. ఇప్పటికే కోస్తాంధ్రలో అన్ని జిల్లాల్లో పర్యటించిన ఆయన రాయలసీమలో పర్యటించిన అభిమానులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ పర్యటనకుగాను షెడ్యూల్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.

పర్యటన సాగనుందిలా..

తొలి రోజు కర్నూలు నగరంలో రోడ్ షో జరగనుంది. మహిళల సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చించనున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చర్చా కార్యక్రమంలో సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధి స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 25న ఆదోనిలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా పవన్ పత్తి రైతులను కలసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. చివరి రోజు అనగా.. 26వ తేదీన ఆళ్ళగడ్డలో జనసేనాని పర్యటించనున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా పలువురు వైసీపీ, టీడీపీ అసంతృప్తులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

More News

కోడి రామకృష్ణ మృతి టాలీవుడ్‌కు తీరని లోటు: పవన్

టాలీవుడ్ లెజెండరీ దర్శకులు కోడి రామకృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

35 లక్షలు మూల్యం చెల్లించిన మహేశ్ ఏఎంబీ సినిమాస్

టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఇటీవల భాగ్యనగరంలో ఏఎంబీ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం విదితమే.

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్‌‌లో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

వరుస ట్వీట్లతో టీడీపీ, వైసీపీని వణికిస్తున్న జనసేనాని!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... గత కొన్ని రోజులుగా వైసీపీ-జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాని అందుకే ఒకర్నోకరు విమర్శించుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తిరుమలలో హిస్టరీ క్రియేట్ చేసిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమలలో అరుదైన రికార్డు సృష్టించారు. కేవలం ఒక గంట యాభై నిమిషాల్లోనే కాలినడకను కొండపై ఉన్న తిరుమల వెంకన్న చెంతకు చేరుకున్నారు.