పవన్ కాటమరాయుడు షూటింగ్ ప్రారంభం
Wednesday, September 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ భారీ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభించారు. సికింద్రాబాద్ దగ్గరలో గల జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ లో ఈరోజు షూటింగ్ ప్రారంభించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈనెల 24 నుంచి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ చిత్రంలో యామిని భాస్కర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆకుల శివ కథ అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments