అ ఆ ఆడియో వేడుకకు ముఖ్య అతిథి పవర్ స్టార్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత నటించింది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించిన అ ఆ ఆడియో వేడుకను మే 2న హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించనున్నారు. అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగే ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.
ఈ విషయాన్ని హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నితిన్ ఇష్క్ ఆడియోను పవర్ స్టార్ రిలీజ్ చేయడం... ఇష్క్ కమర్షియల్ సక్సెస్ సాధించడం తెలిసిందే. మరి...అ ఆ ఆడియో కూడా పవర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది. ఈసారి నితిన్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com