అ ఆ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథి ప‌వ‌ర్ స్టార్..

  • IndiaGlitz, [Saturday,April 30 2016]

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మించారు. మిక్కి జే మేయ‌ర్ సంగీతాన్ని అందించిన అ ఆ ఆడియో వేడుక‌ను మే 2న హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. అభిమానులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో జ‌రిగే ఈ ఆడియో వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు.

ఈ విష‌యాన్ని హీరో నితిన్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 27న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. నితిన్ ఇష్క్ ఆడియోను ప‌వ‌ర్ స్టార్ రిలీజ్ చేయ‌డం... ఇష్క్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించడం తెలిసిందే. మ‌రి...అ ఆ ఆడియో కూడా ప‌వ‌ర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది. ఈసారి నితిన్ ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

More News

స్టైలీష్ స్టార్ కెరీర్లో స‌రైన‌హిట్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ స‌రైనోడు. ఈ చిత్రానికి ఫ‌స్ట్ డే డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్స్ పై ఏమాత్రం ప‌డ‌లేదు.

మే 8 న 'ఒక్క అమ్మాయి తప్ప' ఆడియో విడుదల

'ప్రస్థానం'వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన సందీప్ కిషన్ హీరో గా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'.

ఆడియో విడుదల సన్నాహాల్లో 'కేడి బిల్లా-కిలాడి రంగా'

పసంగ,మేము,కథకళి వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొంది..

చిరు మూవీ ప్రారంభోత్స‌వం - ప‌వ‌న్ రాక‌పోవ‌డానికి కార‌ణం..?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్ర ప్రారంభోత్స‌వం ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో ఓ పండ‌గ‌లా జ‌రిగింది. ఈ వేడుక‌కు దాదాపు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ వ‌చ్చారు. కానీ ముఖ్య‌మైన వ్య‌క్తి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం రాలేదు. త‌మ్ముడు ప‌వ‌న్ కోసం అన్న‌య్య చిరంజీవి స‌ర్ధార్ సెట్స్ కి వెళ్ళి సంద‌డి చేసారు.

మళ్లీ మొదలైన చిరు-బాలయ్య వార్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఈరోజు ప్రారంభమైంది.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.