Bandla Ganesh:పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి.. ఆయనపై సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: బండ్ల గణేష్

  • IndiaGlitz, [Friday,October 13 2023]

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawankalyan) పెళ్లిళ్లపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(JaganMohan Reddy) చేసిన వ్యక్తిగత విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జనసేన(Janasena), టీడీపీ(TDP) నేతలు జగన్ విమర్శలను తీవ్రంగా తప్పుపడుతూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. నిన్నటి నుంచి మనసులో ఒకటే ఆవేదన, బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు. నాకు ఇష్టమైన, దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. మీరు పెద్ద హోదాలో ఉన్నారు.. భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడు. దశాబ్దాలుగా పవన్ కల్యాణ్(Pawankalyan) తో తిరుగుతున్నా ఆయన చాలా నిజాయితీపరుడని, నీతిమంతుడు అని తెలిపారు. ఎవరు కష్టాల్లో ఉన్నా ముందుకెళ్లే వ్యక్తి, భోళా మనిషి పవన్ కల్యాణ్.

నేను అనుభవిస్తున్న ఈ హోదా పవన్ కల్యాణ్‌ పెట్టిన భిక్షే..

ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. కొన్ని ఆయనకు తెలియకుండా జరిగిపోయాయి. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. ఆయనకు కులాభిమానం లేదు. దేశం కోసం బతుకుతున్న వ్యక్తి. స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎవరితోనూ ఆయన మాట్లాడలేదు. పవర్ స్టార్ హోదాలో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న మీరు షూటింగ్‌లు చేసుకోమని, హాయిగా బతకమని చెప్పేవాడిని. మనం చచ్చిపోయినా జనం గుర్తు పెట్టుకోవాలి. జనానికి ఏదో చేయాలని పరితపించే వ్యక్తి. నిస్వార్థంగా జనం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆయన సంపాదించిన సొమ్మును పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారు. పవన్ కల్యాణ్కు కులపిచ్చి ఉంటే నన్ను నిర్మాతను చేసే వాడా..? ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ హోదా మొత్తం పవన్ కల్యాణ్ పెట్టిన భిక్ష. అందరిని ఒక్కటే కోరుతున్నా పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తిపై అబాండాలు వేయవద్దు అని బండ్ల గణేష్(Bandla Ganesh) విజ్ఞప్తి చేశారు.

ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇల్లాలును మారుస్తారు..

గురువారం సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు(Chandrababu) దత్తపుత్రుడికి హైదరాబాద్‌లో ఇల్లు ఉన్నా.. అందులో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు మారిపోతుంటారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసా ఇంటర్నేషనల్.. తర్వాత ఎక్కడికి పోతాడో.. ఆడవాళ్లు, పెళ్లిళ్ల వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని ప్రజలు ఆలోచించాలని తెలిపారు. తన అభిమానులు, కాపుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు ప్యాకేజీ స్టార్ అప్పుడప్పుడు వస్తుంటారని సెటైర్లు వేశారు.