close
Choose your channels

స‌ర్ధార్ త‌ర్వాత ఇక రెండు లేక మూడు సినిమాలు చేస్తాను అంతే... - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Saturday, March 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ....ఈ పేరులో ఎంత ప‌వ‌ర్ ఉందో...ఈ పేరుకి ఎంత క్రేజ్ ఎందో అంద‌రికీ తెలిసిందే. కానీ...ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇదంతా మాయ‌...ఆ దేవుడి ద‌య‌..అంటూ అధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు. అంతే కాదండోయ్ ఎవ‌రైనా ప‌వ‌ర్ స్టార్ రేంజ్ లో ఉన్న‌వారెవ‌రైనా సినిమాయే జీవితం...నా ఆశ - శ్వాస - ధ్యాస అంతా సినిమానే అని చెబుతారు. కానీ ప‌వ‌న్ మాత్రం సినిమాలు వేరు - జీవితం వేరు అంటున్నారు. ఇంకా ప‌వ‌న్ ఏం చెప్పారు....మీరే చ‌ద‌వండి..

మీరు ఎక్కువుగా ఇంట‌ర్ వ్యూస్ ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి..?

నాకు కొంచెం సిగ్గు. అందుచేత ఎక్కువుగా మాట్లాడ‌లేను. (న‌వ్వుతూ..)

మీ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను ట్రెండ్ సెట్ చేస్తాను...ఇలా పాపుల‌ర్ డైలాగ్స్ ఉన్నాయి క‌దా...మీ మ‌న‌స్త‌త్వానికి డైలాగ్స్ కి సంబంధం ఉందా..?

ఆడియోన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయాల‌ని రాసిన డైలాగ్స్ అవి. నా జాబ్ నేను చేసాను అంతే..ప‌ర్స‌న‌ల్ లైఫ్ ని సినిమాలో చూపించాలి అనుకోను.

మీకు గార్డినింగ్ చేయ‌డం అంటే ఇష్టం అని తెలిసింది..

అవును..నాకు వ్య‌వ‌సాయం చేయ‌డం ఇష్టం. రైతు అవ్వాల‌నుకున్నాను. అది త‌ప్ప మిగ‌తా అన్ని జ‌రిగాయి. అందుక‌నే గార్డినింగ్ & ఫార్మ‌ర్ గా ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాను.

మీరు అనుకోకుండా ఎక్ట‌ర్ అయ్యాను అంటున్నారు. కానీ...స్టంట్ కొరియోగ్రాఫ‌ర్, ప్లేబాక్ సింగ‌ర్, రైట‌ర్, డైరెక్ట‌ర్...ఇన్ని ఎలా చేయ‌గ‌లిగారు..?

అవ‌స‌ర‌మే అవ‌న్నీ చేసేలా చేసింది. ఆడియోన్స్ ను న‌న్ను ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ నేను వాళ్ల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాను. అది తెలుసుకుని నేను ఏం చేయ‌గ‌ల‌ను అది చేసాను అంతే.

మీరు సినిమాల్లో ఎక్కువుగా మంచి వ్య‌క్తిగానే న‌టించారు...? మిమ్మ‌ల్ని అంత‌గా ఆద‌రించ‌డానికి అదే కార‌ణం అనుకోవ‌చ్చా..?

నా పాత్రల విష‌యంలో చాలా క్లియ‌ర్ గా ఉంటాను. సినిమాల్లో మంచి వ్య‌క్తిగానే న‌టించాను. చెడ్డ వ్య‌క్తిగా న‌టించాల‌నుకోను. అలాగే ఈ ప్ర‌పంచంలో కంప్లీట్ గా చెడ్డ వ్య‌క్తి అంటూ ఎవ‌రు ఉండ‌రు అనేది నా న‌మ్మ‌కం. అలాగే కంప్లీట్ గా మంచి వ్య‌క్తి అంటూ ఎవ‌రు ఉండ‌రు. ప్ర‌తి మ‌నిషిలో మంచి చెడు అనే రెండు షేడ్స్ ఉంటాయ‌నేది న‌మ్ముతాను.

సినిమాల్లో ఉంటూ పొలిటిక్స్ లో కూడా ఎంటర్ అయ్యారు రిస్క్ అని ఎప్పుడూ మీరు ఫీల‌వ‌లేదా..?

హార్స్ రైడింగ్ చేస్తుంటాం..ప్ర‌మాదం జ‌ర‌గ‌వ‌చ్చు....షూటింగ్ లో ఎలక్ట్ర‌సిటీ ఉప‌యోగిస్తుంటాం..షార్ట్ ష‌ర్క్యైట్ అవ్వ‌చ్చు.అందుచేత రిస్క్ అనేది చూసే దాని బ‌ట్టి ఉంటుంది. ప్ర‌మాదం అనేది ప్ర‌తి చోట ఉంటుంది.

సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డం వ‌ల‌న...అలాగే ర‌క‌ర‌కాల‌ బ్యాడ్ ఎఫెక్ట్స్ సినీ స్టార్స్ పై ప‌డే అవ‌కాశం ఉంటుంది క‌దా..? దీనికి మీరేమంటారు...?

నాకు సినిమాలు జీవితంలో భాగం మాత్ర‌మే కానీ..సినిమాయే జీవితం కాదు.

స్టార్ డ‌మ్ గురించి మీ కామెంట్ ఏమిటి..?

స్టార్ డ‌మ్ అనేది న‌మ్మ‌ను. ఇదంతా భ‌గ‌వంతుడు నాకిచ్చిన వ‌రం. అనుకోకుండా అలా జ‌రిగింది అంతే అనుకుంటాను.

మీ ఫ్యాన్స్ మిమ్మ‌ల్ని ప‌వ‌ర్ స్టార్ అని పిలుస్తారు. ప‌వ‌నిజం అని...?

అది ఎలా వ‌చ్చిందో నాకు తెలియ‌దు.(న‌వ్వుతూ..)

మిమ్మ‌ల్ని ఎందుకు అంతలా అభిమానిస్తున్నార‌నుకుంటున్నారు..?

నేను నా హార్ట్ లో ఏం ఉందో అదే చేస్తున్నాను అంటే నేను నా హార్ట్ ని ఫాలో అవుతున్నాను. వాళ్లు న‌న్ను ఫాలో అవుతున్నారు (న‌వ్వుతూ..)

ఖుషీ బ్లాక్ బ‌ష్ట‌ర్ త‌ర్వాత ప‌దేళ్ల‌లో మూడు బ్లాక్ బ‌ష్ట‌ర్సే ఇచ్చారు. మీ కెరీర్ లో హిట్స్ & ప్లాప్స్ రెండు ఉన్నాయి. సక్సెస్ ని ఫెయిల్యూర్ ని ఎలా చూస్తారు..?

ప్ర‌తి సినిమాకి నేను ఏం చేయ‌గ‌ల‌నో అది చేస్తాను. కానీ కొన్ని స‌క్సెస్ అవుతాయి. కొన్ని ఫెయిల్ అవుతాయి. సినిమాలు ఫెయిల్ అవుతున్న‌ప్పుడు బాగా ఆలోచించాను. అమ్మ‌తో కూడా డిష్క‌స్ చేసాను. అప్పుడు నాకు ఏమ‌నిపించింది అంటే..నేను స్కూల్ మ‌ధ్య‌లోనే మానేశాను. నేనేంటి నాకు ఇంత పాపులారిటీ ఏమిటి అని ఆలోచించాను. అప్పుడు తెలిసింది నాకున్న పాపుల‌రీటి, క్రేజ్ ఇదంతా నాది కాదు. రాసి పెట్టి ఉంది కాబ‌ట్టి వ‌చ్చింది అని. స‌క్సెస్ వ‌స్తే నాది కాదు అని న‌మ్మాను. ఫెయిల్యూర్ వ‌చ్చినా నాది కాదు అనుకున్నాను. అందుకనే స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు పొంగిపోలేదు. ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు కృంగిపోలేదు.

మీరు మ‌ళ్లీ డైరెక్ష‌న్ చేస్తారా..?

డైరెక్ష‌న్ చేయ‌డం క‌న్నా స్ర్కీన్ ప్లే రాయ‌డం అనేది నాకు బెట‌ర్ అనుకుంటున్నాను.

ఇండ‌స్ట్రీలో యంగ్ హీరోస్ వ‌స్తున్నారు. అలాగే వేరే హీరోల సినిమాలు వ‌స్తున్నాయి...ఇలాంటి వార్త‌లు విన్న‌ప్పుడు జ‌ల‌సీగా ఫీల‌వ్వ‌డం..ఇన్ సెక్కూర్ గా ఫీల‌వ్వ‌డం ఎప్పుడైనా జ‌రిగిందా..?

ఎప్పుడూ నేను జ‌ల‌సీగా ఫీల‌వ్వ‌డం కానీ ఇన్ సెక్యూర్ గా ఫీల‌వ్వ‌డం కానీ జ‌ర‌గ‌లేదు.

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ త‌ర్వాత మీ ప్లానింగ్ ఏమిటి..?

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత రెండు మూడు సినిమాలు చేస్తాను అంతే. ఆత‌ర్వాత సినిమాల్లో న‌టించ‌ను.

సినిమాల్లో న‌టించ‌ను అంటున్నారు. ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం ఏమిటి..?

ఇది నాకు నేను తీసుకున్న నిర్ణ‌యం. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం కాదు. ఎప్పుడో తీసుకున్న నిర్ణ‌యం. పొలిటిక్స్ లో ప్ర‌వేశించాం అంటే పూర్తిగా న్యాయం చేయాలి. నెక్ట్స్ ఎలక్ష‌న్స్ కి పోటీ చేయాల‌నుకుంటున్నాను. అందుచేత తీసుకున్న నిర్ణ‌యం ఇది.

పొలిటిక్స్ లోకి రావాల‌ని ఎప్పుడు అనిపించింది...?

పొలిటిక్స్ రావ‌డం అనేది ఇప్ప‌టికిప్పుడు అనుకుని వ‌చ్చింది కాదు. చిన్న‌ప్ప‌టి నుంచి ఇంట్ర‌స్ట్ ఉంది. సోష‌ల్ బుక్స్ చ‌ద‌వ‌డం వ‌ల‌న స్వాతంత్ర్య ఉద్య‌మంలో ఏం జ‌రిగింది అనేది తెలిసింది. ఆ ప్ర‌భావం వ‌ల‌న కావ‌చ్చు పాలిటిక్స్ పై ఇంట్ర‌స్ట్ ఏర్ప‌డింది.

మీ స‌న్ పేరు అకిర్ కొర‌సోవా..అని పెట్టారు..? వ‌ర‌ల్డ్ సినిమాలు ఎక్కువుగా చూస్తారా..?

వ‌ర‌ల్డ్ సినిమాలు చూస్తాను. కానీ బాగా ఎక్కువుగా చూడ‌ను. అకిర కొర‌సోవా సినిమాలంటే చాలా ఇష్టం. ఆయ‌న క‌థ‌ను చెప్పే విధానం...క్యారెక్ట‌ర్స్ ను మ‌లిచిన విధానం నాకు బాగా ఇష్టం.

వ‌ర‌ల్డ్ సినిమాల గురించి తెలిసిన వ్య‌క్తిగా తెలుగు సినిమా గురించి ఏం చెబుతారు..?

తెలుగు సినిమా అంటే న‌వ‌ర‌సాలు ఉండాలి. అన్ని క‌ల‌సి ఒక సినిమాలో ఉండాలంటే చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. హాలీవుడ్ సినిమా చూస్తే..ఇది ఈ త‌ర‌హా సినిమా అని తెలుస్తుంది. కానీ ఇక్క‌డ అలా కాదు. సినిమా కోసం చాలా చేయాలి. గెడ్డం పెంచాలి అంటారు. మేక‌ప్ అంటారు. రెండు సంవ‌త్స‌రాల క్రితం ఆరు నెల‌ల వ‌ర‌కు గెడ్డంతోనే ఉన్నాను. అదే పొలిటిక్స్ అయితే ఇవేమి చేయ‌న‌వ‌స‌రం లేదు. చాలా కంఫ‌ర్ట్ గా ఉండ‌చ్చు.

సినిమా సినిమాకి గ్యాప్ వ‌స్తుంటుంది క‌దా..ఈ గ్యాప్ లో మీరు ఏం చేస్తుంటారు..?

నేను ఎక్కువుగా బుక్స్ చ‌దువుతుంటాను. రైతుల భూములు గురించి వాళ్లతో మాట్లాడ‌డం...భూముల గురించి యాక్ట్ ఎలా ఉందో తెలుసుకోవ‌డం చేస్తుంటాను. లాండ్ ఆర్డ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ మీద ఫోక‌స్ చేస్తుంటాను.

రెండు మూడు సినిమాల త‌ర్వాత సినిమాలు చేయ‌డం ఆపేయ‌డం...?

నాకు మ‌నీ కావాలి కాబ‌ట్టి న‌టించ‌డం మానేసినా...క‌థ - స్ర్కీన్ ప్లే రాస్తుంటాను. న‌టించ‌డం అంటే టైమ్ కావాలి. కానీ..రాయ‌డం అనేది నా ఫ్రీ టైమ్ లో రాయ‌చ్చు కాబ‌ట్టి క‌థ - స్ర్కీన్ ప్లే రాస్తాను.

మీరొక లెగ‌సీ..ఎలా గుర్తుండాల‌నుకుంటారు..?

లెగ‌సీ అనేది నేను న‌మ్మ‌ను. మ‌న ప‌నిని చేసి వెళ్లిపోవాలి అంతే. మ‌నం చేసే ప‌నికి లెగ‌సీ వ‌స్తుందా రాదా అనేది మ‌న చేతుల్లో లేదు. ప‌వ‌నిజం అంటుంటే...నిజంగా నాకు అర్ధం కాదు. ఇది అవ‌స‌ర‌మా అనిపిస్తుంటుంది. లెగ‌సీ వ‌ల‌న అర్హ‌త లేని వాళ్లు పైకి వ‌స్తున్నారు. అది నాకు న‌చ్చ‌దు.

ప్రొడ‌క్ట్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మీరు ఎందుకు చేయ‌డం లేదు..?

నిజంగా ప్రాడెక్ట్ ని న‌మ్మ‌క‌పోతే ఎడ్వ‌టైజ్ చేయ‌కూడ‌దు అనేది నా అభిప్రాయం. నేను వాడ‌ని వాటి గురించి అంబాసిడ‌ర్ గా చేయడానికి మ‌న‌సాక్షి ఒప్ప‌కోదు. నేను వాడే వాటికే ఎడ్వ‌టైజ్ చేయాలేమో. వేరే ఏక్ట‌ర్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారంటే జ‌ల‌సీగా ఫీల‌వుతాను (న‌వ్వుతూ..)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment