'వేదాళం' రీమేక్ లో పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఖుషీ, పులి దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వినపడున్న సమాచారం మేరకు వీరిద్దరి కాంబినేషన్‌లో గతేడాది తమిళంలో విడుదలైన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారట. చాలా లైన్స్ విన్న పవన్‌కళ్యాణ్ ఈ సినిమా లైన్ వినగానే ఎస్ చెప్పాడట. సిస్టర్ సెంటిమెంట్‌తో రివేంజ్ డ్రామాగా తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సూర్య లోకేషన్స్ వేటలో ఉన్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com