జల్సాలో పవన్.. RRR లో ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రిటిష్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.
రాజమౌళి సినిమా అంటే హీరోలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. హీరోల ఆయుధాలు, వాహనాల విషయంలో రాజమౌళి ప్రత్యేక శ్రద్ద వహిస్తారు. ఇక ఆర్ఆర్ఆర్ లో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. రాంచరణ్ ని నిప్పుతో, ఎన్టీఆర్ ని వాటర్ తో ముందు నుంచి ప్రొజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: అమేజింగ్.. బికినీలో రకుల్ అందాల ట్రీట్!
ఇక రాంచరణ్ వాహనంగా గుర్రాన్ని వాడుతున్నాడు. ఎన్టీఆర్ బైక్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆ పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కుతోంది. అప్పట్లో గుర్రాలు కామన్. కానీ ఎన్టీఆర్ ఉపయోగిస్తున్న బైక్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఆ తరహా బైక్ ని తొలిసారి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసమే ఉపయోగించడం లేదు. గతంలో కొన్ని చిత్రాల్లో ఆ బైక్ వాడారు. 2008లో జల్సా చిత్రంలో పవన్ కళ్యాణ్ ఆ బైక్ తో కనిపించాడు. చూడడానికి సూపర్ స్టైలిష్ గా ఉండే ఆ బైక్ ఇప్పటి మోడల్ కాదు. ఆ బైక్ కు పెద్ద చరిత్రే ఉంది.
ఆ బైక్ పేరు 'వెలాసిటీ'. 1896లో బ్రిటిష్ వ్యక్తులు జాన్ గుడ్మాన్, విలియం అనే ఇద్దరు వక్తులు ఈ కంపెనీని స్థాపించారు. అప్పట్లో అది సైకిల్స్ తయారు చేసే చిన్న సంస్థ. 1896లో స్థాపించినప్పటికీ ఈ సంస్థ పేరు ప్రఖ్యాతలు గడించి అత్యధికంగా బిజినెస్ చేసింది మాత్రం 1920, 1950 మధ్యలో.
ఫాస్ట్ అని అర్థం వచ్చే ఇటాలియన్ పదం పేరుతో ఈ సంస్థ వెలాసిటీ బైక్స్ తయారు చేసేది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సంస్థ 192సిసి కెపాసిటీ వాటర్ కూల్ ఫ్లాట్ ట్విన్ ఇంజన్స్ తో వెలాసిటీ బైక్స్ ని తయారు చేసింది. ఈ బైకులనే బ్రిటిష్ పోలీసులు ఉపయోగించేవారు.
అప్పట్లో ఇండియాలో బ్రిటిష్ రూలింగ్ కాబట్టి ఇక్కడికి కూడా ఆ బైకులని దిగుమతి చేశారు. ఆ బైక్ నే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఉపయోగిస్తున్నాడు. ఈ బైక్ తో ఎన్టీఆర్ చేయబోయే విధ్వంసం ఏంటో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout