57 బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్

  • IndiaGlitz, [Tuesday,April 09 2019]

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలుకుని నేటి వరకూ ప్రధాన పార్టీల అధినేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు.

కాగా ఇవాళ్టి వరకు మొత్తం 57 బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. కాగా రాజమండ్రి బహిరంగ సభా వేదికగా మేనిఫెస్టో అంశాలను వెల్లడించడం జరిగింది. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి మూడు సభల్లో పవన్ పాల్గొన్నారు.

మరోవైపు చివరి రోజున పవన్ పోటీచేస్తున్న భీమవరంలో ఎన్నికల ప్రచారానికి జనసేనాని ముగింపు పలికారు. కాగా పవన్ గాజువాక, భీమవరం రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విషయం విదితమే. 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న జనసేన ఎన్ని సీట్లు దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.

More News

రాబోయేది జనసేన ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది జనసేన ప్రభుత్వమేనని అంతా గుర్తుపెట్టుకోండని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు.

అసెంబ్లీలో అడుగుపెడతా.. యువతకు పోలీస్ ఉద్యోగాలిస్తా!

రాజకీయాలకు కావాల్సింది వేలకోట్లు డబ్బు కాదని.. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే భావజాలం, మార్పు తీసుకురావాలన్న తపన, ప్రత్యర్ధులను ఎదుర్కొనే గుండె ధైర్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఏపీలో మూగబోయిన ఎన్నికల మైక్స్!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకుని నేటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

స్పీడ్ పెంచిన టెక్ మహీంద్ర.. రెండు కంపెనీల్లో వాటాలు

దేశీయ ఐటీ సంస్థ, ఐటీ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా వాటాల కొనగోళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం నాడు మరో రెండు కంపెనీల్లో వాటాలు కొనగోలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.

అనూహ్యంగా భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

కొత్త ఎకనమిక్ ఇయర్ ప్రారంభం అయిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి.