‘వకీల్‌సాబ్’లో చేసిన తొలిమార్పు అదే.. పవన్ మెచ్చుకున్నారు: వేణు శ్రీరామ్
Send us your feedback to audioarticles@vaarta.com
‘వకీల్‌సాబ్’ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆయన అభిమానులంతా సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఐదు పాటలుంటాయని వేణు శ్రీరామ్ వెల్లడించారు. అయితే పవర్ స్టార్ డ్యాన్సులను మాత్రం ఈ చిత్రంలో చూడలేమని తెలిపారు. కథకు సంబంధించి చూస్తే ఈ చిత్రంలో డ్యాన్సులకు స్కోప్ లేదని ఆయన తెలిపారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ సాంగ్ గురించి వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. కథలో తాను చేసిన తొలి మార్పు అదేనన్నారు. మన జీవితంలో మహిళల పాత్రను వర్ణిస్తున్నప్పుడు ముఖ్యంగా వారి గొప్పతనాన్ని వివరిస్తే బాగుంటుందని అనిపించిందని తెలిపారు. ఈ విషయాన్ని పవన్‌కు కూడా చెప్పానని.. ఆయన కూడా మెచ్చుకున్నారని వేణు శ్రీరామ్ తెలిపారు.
వకీల్ సాబ్’ కథకు కొన్ని పరిమితులున్నాయని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు. ఒక మాస్ పాట పెట్టి, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్‌గా చేయలేని కథ అని వెల్లడించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు. అయితే అప్పటికి థియేటర్లు తెరుచుకుంటే డిసెంబర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. వెండితెరపై ఈ సినిమాను చూడాలని.. తానూ ఎదురు చూస్తున్నానని వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ‘వకీల్‌సాబ్’ను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments