పవన్ హీరోయిన్.. ఒకే రోజు రెండు చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
మజ్ను (2016) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్. ఆ తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత్తతో పలకరించిన ఈ చిన్నది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి జోడీగా అతని 25వ చిత్రంలో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న నాపేరు సూర్యలోనూ అను కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే.. అను నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలకి సిద్ధమయ్యాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ కథానాయకుడిగా ఆక్సిజన్ పేరుతో ఓ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాశి ఖన్నా ఓ హీరోయిన్ గా నటించగా.. మరో హీరోయిన్ గా అను నటించింది. ఈ సినిమా కోసం ఆ మధ్య రకరకాల డేట్స్ వినిపించినా.. చివరాఖరికి నవంబర్ 10న విడుదల కాబోతోంది.
కరెక్ట్‌గా అదే రోజు.. విశాల్‌తో అను నటించిన తమిళ చిత్రం తుప్పరివాలన్ డబ్బింగ్ వెర్షన్ డిటెక్టివ్ రిలీజ్ కాబోతోంది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తున్న ధీమాతో ఉంది అను. మొత్తమ్మీద ఒకే రోజున అను నటించిన రెండు చిత్రాలు విడుదలకి సిద్ధమయ్యాయన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com