పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తాజాగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రణీత వివాహం చేసుకుంది. అవును.. ఈ వార్త నిజమే. ప్రణీత పెళ్లి తంతు చాలా సైలెంట్ గా జరిగిపోయింది.
ఆమె వివాహానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య సింపుల్ గా ఆమె పెళ్లి జరిగింది. వరుడి పేరు నితిన్ రాజు. తన పెళ్ళికి సంబంధించి కొన్ని వివరాలని ప్రణీత మీడియాకు తెలిపిందట. నితిన్ రాజు బెంగుళూరులో బిజినెస్ మ్యాన్. తన స్నేహితుల ద్వారా ప్రణీతకు నితిన్ తో పరిచయం ఏర్పడిందట.
పరిచయం ప్రేమగా మారడం, కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో పెళ్లి చేసుకున్నట్లు ప్రణీత చెప్పుకొచ్చింది. తమది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని ప్రణీత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ప్రణీత నేరుగా ఇంకా తన వివాహంపై స్పందించలేదు. ఆమె పెళ్లి ఫోటోలు మాత్రం వైరల్ అయ్యాయి. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments