రూ. 175 కోట్ల బంగ్లాలో బిజినెస్ మ్యాన్ తో పవన్ హీరోయిన్ సహజీవనం?
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంక అందాల సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 20019లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాక్వెలిన్ హౌస్ ఫుల్, మర్డర్ 2, కిక్ లాంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం జాక్వెలిన్ బాలీవుడ్ లో పెద్ద బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉండగా జాక్వెలిన్ తన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా లోప్రొఫైల్ మైంటైన్ చేస్తూ ఉంటుంది. కానీ తాజాగా జాక్వెలిన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారం ఈ వార్తకు బలం చేకూరేలా ఉంది.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలో ఓ బిజినెస్ మ్యాన్ తో సహజీవనం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా జాక్వెలిన్ సౌత్ ఇండియాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో ఉందట. వీరిద్దరి మధ్య చాలా సీరియస్ గా ఎఫైర్ సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రారంభం నుంచే వీరిద్దరూ సహజీవనం చేయాలని అనుకున్నారట. కానీ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ జంట ముంబైలో మంచి ఇంటి కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు జాక్వెలిన్ ఓ ఇంటిని ఫైనల్ చేసింది. జుహు ప్రాంతంలో సీ ఫేసింగ్ ఉండే అందమైన బంగ్లాని ఈ జంట కొనుగోలు చేసినట్లు టాక్.
ఆ బంగ్లా ఖరీదు తెలిస్తే షాక్ కావాల్సిందే. రూ. 175 కోట్లు వెచ్చించి ఈ బంగ్లాని కొనుగోలు చేశారట. త్వరలోనే ఆ ఇంట్లో వీరిద్దరి లైవ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్ కోసం ఫ్రాన్స్ నుంచి స్పెషలిస్టులని రప్పిస్తున్నట్లు సమాచారం.
ఇంత జరుగుతున్నా జాక్వెలిన్ తన ప్రియుడి వివరాలు మాత్రం గోప్యంగానే ఉంచుతోంది. సినిమాల విషయానికి వస్తే జాక్వెలిన్ ప్రస్తుతం అటాక్, బూత్ పోలీస్, బచ్చన్ పాండే లాంటి చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో జాక్వెలిన్ టాలీవుడ్ లోకి కూడా డెబ్యూ చేయబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంలో జాక్వెలిన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments