Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్  : ఆ రోజున, ఆ థియేటర్‌లో గ్రాండ్ లాంచ్.. పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే

  • IndiaGlitz, [Wednesday,May 10 2023]

దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం హరీశ్ శంకర్ ఏళ్ల పాటు ఎదురుచూశారు. చివరికి ఆయన నిరీక్షణ ఫలించి సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు హరీశ్ శంకర్. ఇలా మొదలెట్టారో లేదో.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిపోయింది. హైదరాబాద్‌లో 8 రోజుల పాటు జరిగిన ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఓ భారీ యాక్షన్ సీన్, పిల్లలతో కామెడీ సీన్, శ్రీలీల-పవన్ మధ్య రోమాంటిక్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇక అన్నింట్లోకి రామ్ లక్ష్మణ్ తెరకెక్కించిన యాక్షన్ సీన్ గురించి ఫిలింనగర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, వంద మంది ఫైటర్లు ఈ సీన్ కోసం కష్టపడ్డారట.

సంధ్య 35 ఎంఎంలో ఉస్తాద్ గ్లింప్స్:

ఇదిలావుండగా.. పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మేకర్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మే 11న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో లాంచింగ్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే.. మే 11కు ఓ ప్రత్యేకత వుంది. హరీశ్ శంకర్- పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’’ విడుదలై ఆ రోజుకు 11 ఏళ్లు పూర్తికానున్నాయి. ఇన్నేళ్ల విరామంత తర్వాత తిరిగి పవన్, హరీశ్ శంకర్‌లు సినిమా చేస్తుండటంతో ఆ రోజునే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు మేకర్స్.

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు :

ఇకపోతే.. గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత హరీశ్ శంకర్ , పవన్ కల్యాణ్‌ల కాంభినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలల హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

More News

Vivek Agnihotri:మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.. ఎందుకంటే..?

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపారు ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

Somesh Kumar:సోమేశ్ కుమార్‌కు కీలక పదవిని కట్టబెట్టిన కేసీఆర్.. కేబినెట్ ర్యాంక్, ఏ పోస్ట్ అంటే..?

మాజీ సీఎస్ , రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్ కుమార్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు.

Ram Charan:విజయ్ దేవరకొండ బర్త్ డే.. నీ ఫ్యాన్స్‌ని ఖచ్చితంగా మెచ్చుకోవాలంటూ చరణ్ ట్వీట్, ఎందుకంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య తొలి నుంచి సుహృద్భావ సంబంధాలే వుండేవి.

Adipurush Trailer : ‘‘వేల ఏళ్ల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్పుకోవాలి’’.. ఆదిపురుష్  ట్రైలర్ వచ్చేసిందోచ్

భారతీయుల ఇతిహాసం రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’.

Kushi:'ఖుషీ' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. విజయ్, సమంతల కెమిస్ట్రీ సూపర్బ్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత నటిస్తోన్న చిత్రం ‘‘ఖుషీ’’.