పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘'భవదీయుడు భగత్ సింగ్'' చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు ఉదయం 9.45 నిమిషాలకు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర దర్శక,నిర్మాతలు.
‘'భవదీయుడు భగత్ సింగ్'' ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే ....' ఆధునిక వాహనం పై కథానాయకుడు పవన్ కళ్యాణ్ జీన్స్, జర్కిన్ వస్త్ర ధారణలో ఓ చేతిలో టీ గ్లాస్,మరో చేతిలో స్పీకర్. స్టైలిష్ గా కూర్చొని ఉండటం కనిపిస్తుంది.
'భవదీయుడు' అన్న పదం వినయం, విధేయత గా అనిపిస్తే...
'భగత్ సింగ్' విప్లవ చైతన్యానికి మారుపేరు గా స్ఫురిస్తుంది.
ఈ రెండింటినీ కలిపి ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అని పెట్టడంలో దర్శకుడు ఆంతర్యమేమిటి...?
ఈ చిత్రం ఓ లేఖ అయితే.. 'భవదీయుడు భగత్ సింగ్' అనేది ఓ సంతకం అయితే.....
ఈ లేఖలో ఏం రాశారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పబోతున్నారు, అన్నీ ఆసక్తిని, ఆలోచనలు రేకెత్తించేవే....
చిత్రంలో సామాజిక అంశాల ప్రస్తావన
తప్పని సరా ? కథాబలం,సన్నివేశాలలో భావోద్వేగాలు, పాత్రలమధ్య సంఘర్షణ, తూటాల్లాంటి మాటలు ఈ చిత్రం స్వంతమా ..?అనిపిస్తుంది. ఖచ్చితంగా 'భవదీయుడు భగత్ సింగ్' వెండితెరపై ఓ చెరగని సంతకం అనిపిస్తుంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు మరోసారి అభిమాన ప్రేక్షకులను నిస్సందేహంగా ఉర్రూతలూగించనున్నాయి. ఒకటేమిటి మరెన్నో విశేషాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నాయి. ఒక్కొక్కటిగా సందర్భాన్ని బట్టి ప్రకటించనున్నారు. ఒక డైనమైట్ లాంటి హీరో మీద, మరో డైనమైట్ లాంటి పేరు పెట్టి చిత్రం మీద ఉత్సుకతను, అంచనాలను మరింతగా పెంచారు చిత్రం మేకర్స్. "దిస్ టైం ఇట్స్ నాట్ జస్ట్ ఎoటర్ టైన్ మెంట్" అని ప్రచార చిత్రం లో కనిపించే అక్షరాలు అక్షరాల నిజం అనిపించేలా " ‘'భవదీయుడు భగత్ సింగ్'' ఉండబోతోంది.
ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది అని తెలుపుతూ తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
ఈ చిత్రానికి అయనాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout