'హరిహర వీరమల్లు'... కాస్ట్యూమ్స్ ప్రత్యేకతలివే!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హరిహరవీరమల్లు'. ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చకచకా జరుగుతోంది. 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, కులీ కుతుబ్‌షాలను ఎదిరించిన ఓ వీరుడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి కథ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌తో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. పీరియాడిక్ మూవీ కావడంతో సినిమా కోసం క్రిష్ అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్య రాజీవ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈమె ఇది వరకు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇప్పుడు మరోసారి క్రిష్ దర్శకత్వంలో పనిచేస్తున్నారు ఐశ్వర్య రాజీవ్.
ఆమె 'హరిహర వీరమల్లు' గురించి మాట్లాడుతూ "ఇప్పటి వరకు చాలా మందికి తెలియని ఓ కథాంశం కాబట్టి, కాస్ట్యూమ్స్, గెటప్స్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌గారు ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. ఆయన గెటప్స్‌తో పాటు 30 రకాల దుస్తులను ధరిస్తారు. ఆయన గెటప్ కాస్ట్యూమ్స్ గురించి ఏమంటారోనని అనుకున్నాను. కానీ ఆయన రెండు, మూడు దుస్తులను ట్రై చేయగానే ఓకే చెప్పేశారు. అలాగే ఆయన చేతికి ధరించిన కడియం, అభరణాలు, చెప్పులు వీటన్నింటినీ మేమే తయారు చేశాం. యూనిట్‌లో ఇతరుల కాస్ట్యూమ్స్ కోసం వెయ్యి థానుల ఫ్యాబ్రిక్‌ను తెప్పించి సిద్ధం చేశాను" అని అన్నారు ఐశ్వర్య రాజీవ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments