శివరాత్రి రోజున ‘హరిహర వీరమల్లు’గా పవన్ ఎంట్రీ..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సారి ‘హరిహర వీరమల్లు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని శివరాత్రి కానుకగా నేడు విడుదల చేశారు. నిజంగా అభిమానులకు సర్‌ప్రైజింగ్ ట్రీట్ అనే చెప్పాలి. అలాగే పరమశివుడికి మరో పేరైన హరిహర టైటిల్‌తో.. కాస్త సెంటిమెంట్ టచ్‌గా కూడా ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వస్తుందని ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో అభిమానుల సందడి స్టార్ట్ అయిపోయింది. నేడు వదిలిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై డేరింగ్ అండ్ డ్యాషింగ్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్‌లో పవన్ మునుపెన్నడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది కాబట్టి ఆ కాలానికి తగ్గట్టుగా అద్భుతమైన ఆకట్టుకునే సెట్స్ మధ్య పవన్‌ను క్రిష్ చూపించారు. ఈ చిత్రంలో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నారని టాక్. అంతేకాదు.. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దాదాపు రూ.150 కోట్లను ఏఎం రత్నం ఈ సినిమా కోసం వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. కేరెక్టర్ వజ్రాల దొంగే అయినప్పటికీ పవన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ లుక్ తర్వాత పవన్ కల్యాణ్‌నే కాదు.. ఆయనతో ఈ సినిమా చేస్తున్న క్రిష్‌ని, రత్నంని కూడా ఆయన అభిమానులు ఆరాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఔరంగజేబు కాలం నాటి కట్టడాలన్నింటిని.. ఈ చిత్రంలో చూపించి.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కూడా ఆ కాలానికి తీసుకెళ్లేందుకు క్రిష్ ఈ సినిమాను సిద్ధం చేస్తున్నట్లుగా ఉంది. ఈ తరహా పాత్ర కానీ.. పిరియాడిక్ మూవీ కానీ పవన్ కెరీర్‌లోనే చేసింది లేదు. అందుకే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇప్పుడు వదిలిన అప్‌డేట్ చూస్తుంటే ఆ అంచనాలను మరింత పెంచేదిగా కనిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ వదిలిన ఫస్ట్‌లుక్ ట్రెండ్ సెట్టర్ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే షాకింగ్ లైక్స్‌ను ఈ ఫస్ట్‌లుక్ సొంతం చేసుకుంటోంది. మొత్తానికి ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలవబోతోందనడంలో సందేహం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com