క్వారంటైన్‌లో పవన్..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదటి దశ కంటే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన కార్య నిర్వాహకులతో పాటు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా పవన్‌కు చాలా సమీపంగా ఉండటంతో ఆయన వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌కు వెళ్లినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
‘‘జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో శ్రీ పవన్ కల్యాణ్ గారు క్వారంటైన్ కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్ కు వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు’’ అని జనసేన పార్టీ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments