ఆ డైరెక్టర్ కి మళ్లీ పవన్ అవకాశం ఇస్తున్నాడు...

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్...గ‌తంలో అవ‌కాశం ఇచ్చిన ఓ డైరెక్ట‌ర్ కి మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తున్నాడు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఎస్.జె.సూర్య‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో రూపొందిన తొలి చిత్రం ఖుషీ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో మ‌నంద‌రికి తెలిసిందే. ఆత‌ర్వాత రెండోసారి ప‌వ‌న్, సూర్య క‌ల‌సి చేసిన సినిమా కొమ‌రం పులి. ఈ సినిమా ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. అంతేకాదు..కొమ‌రం పులి త‌ర్వాత సూర్య చేసిన సినిమాలు అంత‌గా అల‌రించ‌లేదు. అయితే స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న సూర్య‌కి ప‌వ‌న్ అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం.ప‌వ‌న్ తో ఖుషీ సినిమాకి సీక్వెల్ చేయాల‌ని సూర్య ప్లాన్ చేస్తున్నార‌ట‌.మ‌రి..ఇది నిజ‌మో..కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.