పవన్ ఓకే చెప్పాడట...

  • IndiaGlitz, [Monday,August 24 2015]

చిన్న, పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. శిరీష్, లక్ష్మణ్ ల సహకారంతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు తక్కువ కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు, తర్వాత నాళ్ళలో నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని చాలా ప్రయత్నించాడు.

కానీ కుదరలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ దిల్ రాజుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం దిల్ రాజు ఆ విషయమై చాలా హ్యపీగా ఉన్నాడట. అయితే డైరెక్టర్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదట.

More News