అలీ గురించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ మధ్య స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం కూడా. పవన్ సినిమా చేస్తున్నాడంటే చాలు ఆ సినిమాలో చిన్నపాటి పాత్రలో అయినా సరే అలీ చేస్తుంటాడు. అయితే ఎప్పట్నుంచో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న అలీ.. జనసేనలో చేరతారని అందరూ భావించారు. అప్పట్లో జనసేనానిని, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా వరుసగా అందరితో భేటీ అయ్యి చివరికి అనూహ్యంగా లోటస్‌పాండ్‌లో అలీ ప్రత్యక్షమయ్యాడు. అయితే సడన్‌గా వైసీపీ అధినేతవ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అలీ.. పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కంగుతిన్నారు. అయితే ఇప్పటి వరకూ అలీ గురించి మాట్లాడని పవన్ కల్యాణ్.. కాకినాడ ఎన్నికల ప్రచార సభావేదికగా స్పందించారు.
అలీ గురించి మాట్లాడుతూ పవన్ తీవ్ర ఆవేదన...
కాకినాడ సభలో అలీ గురించి పవన్ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "అలీ నాకు మిత్రుడైనా జగన్‌తో చేతులు కలిపారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చాను. అలీకి కూడా నరసారావుపేట ఎంపీ టిక్కెట్ ఇస్తానని చెప్పాను. అయినా నన్ను వదిలి వైసీపీలో చేరిపోయాడు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. నాతో కలిసి పనిచేస్తానన్న అలీ చెప్పకుండానే వైసీపీలోకి వెళ్లిపోయారు. అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుంది. అవసరంలో నేను ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే ఇంకా ఎవరిని నమ్మాలి..? అందుకే ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదు. అలీ ఇదేనా స్నేహమంటే..?. మనిషిని మనిషిగా చూస్తాను..కులం కాదు. పీఆర్పీ తర్వాత పార్టీలోకి రమ్మని ఎవర్నీ నేను బొట్టు పెట్టి పిలవను. అలీని వైసీపీ నేతలు వాడుకున్నారు. ఎన్నికల్లో ఏం జరుగుతోందో నాకు తెలియదు. నాకు ఓట్లు వేసినా వేయకపోయినా ముఖ్యమంత్రి కాకపోయినా తుది శ్వాస వరకు అందుబాటులో ఉంటాను" అని పవన్ కల్యాణ్ అలీ గురించి మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout