close
Choose your channels

స‌ప్త‌గిరి కోసం ప‌వ‌ర్ స్టార్..!

Friday, October 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి హీరోగా న‌టిస్తున్నచిత్రం స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది.

అయితే...త్వ‌ర‌లో స‌ప్త‌గిరి ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. స‌ప్త‌గిరి అడ‌గ‌డంతో ప‌వ‌ర్ స్టార్ ఓకే వ‌స్తాన‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. నవంబ‌ర్ 6న ఈ ఆడియో ఫంక్ష‌న్ ను గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకున్న‌ట్టుగా ప‌వ‌న్ ఈ ఆడియో వేడుక‌కు వ‌స్తే...స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.