స‌ప్త‌గిరి కోసం ప‌వ‌ర్ స్టార్..!

  • IndiaGlitz, [Friday,October 28 2016]

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి హీరోగా న‌టిస్తున్నచిత్రం స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది.

అయితే...త్వ‌ర‌లో స‌ప్త‌గిరి ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. స‌ప్త‌గిరి అడ‌గ‌డంతో ప‌వ‌ర్ స్టార్ ఓకే వ‌స్తాన‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. నవంబ‌ర్ 6న ఈ ఆడియో ఫంక్ష‌న్ ను గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకున్న‌ట్టుగా ప‌వ‌న్ ఈ ఆడియో వేడుక‌కు వ‌స్తే...స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం..!

More News

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆమె అతడైతే' చిత్రం అందరికి నచ్చుతుంది - నిర్మాతలు ఎం.మారుతిప్రసాద్ , నెట్టెం రాధాకృష్

కొత్తదనం ఉన్న చిత్రాలను,విభిన్నమైన కధా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేశారు.

బుల్లితెర పై రజనీ కబాలి..!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సంచలన చిత్రం కబాలి.

నాగ్ హ‌ర్ర‌ర్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున... ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ట్రెమండస్ పెనింగ్స్ సూపర్ ట్తెచ్చుకున్న కార్తీ 'కాష్మోరా'

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

అక్కినేని నాగార్జున విడుదల చేసిన 'నరుడా..! డోనరుడా' ఆడియో

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న చిత్రం `నరుడా..! డోనరుడా..!`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.