సెంటిమెంట్ ఫాలో అవుతున్న ప‌వ‌న్..

  • IndiaGlitz, [Wednesday,May 18 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన ప‌వ‌న్ ఈసారి ఎలాగైనా స‌రే స‌క్సెస్ సాధించాలి అనుకుంటున్నార‌ట‌. అందుక‌నే ప‌వ‌న్ స‌క్సెస్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఇంత‌కీ ఆ సెంటిమెంట్స్ ఏమిటంటే...ప‌వ‌న్ కెరీర్లో ఎప్పటికీ మ‌ర‌చిపోలేని చిత్రం ఖుషీ. ఈ సంచ‌ల‌న‌ చిత్రం ఖుషీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజునే ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అలాగే పొల్లాచ్చిలో షూటింగ్ చేసిన ప‌వ‌న్ సినిమాలు దాదాపు స‌క్సెస్ సాధించాయి. అందువ‌ల్ల‌నే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పొల్లాచ్చిలో ప్లాన్ చేసార‌ట‌. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే...గ‌బ్బ‌ర్ సింగ్ లో శృతిహాస‌న్ న‌టించింది. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. అందుక‌నే సెంటిమెంట్ ప‌రంగా ఈ చిత్రానికి కూడా హీరోయిన్ గా శృతిహాస‌న్ నే సెలెక్ట్ చేసారు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి...సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి ప‌వ‌న్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.