మంత్రి మేకపాటిపై పవన్ ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
దివీస్ లాబొరేటరీస్ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడమని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అడుగుతున్నారంటే ఆయన చిత్తశుద్ధిపై సందేహం కలుగుతోందని సందేహాలు కలుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన చెబుతున్న మాటలు సమస్యను ఏమార్చేదిగా బోడిగుండుకి బొటన వేలుకి ముడిపెట్టినట్టు ఉందన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తొండంగా మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటవుతున్న దివిస్ లాబొరేటరీస్ కర్మాగారం కారణంగా అక్కడి 15 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులకు సోకడం లేదా? అని ప్రశ్నించారు. ఆ కర్మాగారానికి అనుమతులిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని తప్పించుకోవడానికి యత్నంచడం ఎంత వరకూ సబబో మరోసారి ఆలోచించాలని మంత్రి గౌతంరెడ్డికి సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిస్తే మీరు ఆపరా? అని ప్రశ్నించారు. ఆయన ప్రారంభించిన అన్నింటినీ ఒక్కొక్కటిగా రద్దు చేశారు కదా అని పవన్ గుర్తు చేశారు.
రాజధాని అమరావతిని ఆపారని.. పోలవరం ప్రాజెక్టును రివర్స్‌లో తీసుకెళుతున్నారన్నారు. ‘మరి అదే విధంగా దివీస్ కర్మాగారంపై అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుని.. ఆ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకోవచ్చుగా... కనీసం అరెస్ట్ చేసిన 36 మందిని వదిలి పెట్టలేరా? అని పవన్ ప్రశ్నించారు. ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నీకింత.. నాకింత అని కిక్ బ్యాక్స్ తీసుకున్నారా? లేదా ప్రత్యర్థులను పథకం ప్రకారం హతమార్చారా? కేవలం ఫ్యాక్టరీ వద్దన్నందుకు అమాయకులను అరెస్టులు చేసి జైళ్లలో పెడతారా? వారి కుటుంబాల శోకం మీ ప్రభుత్వానికి తప్పక తగులుతుంది’’ అని పవన్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments