వెంకటరమణ కుటుంబానికి 5 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన పవన్..!
- IndiaGlitz, [Saturday,September 10 2016]
కాకినాడలో జరిగిన జనసేన సభలో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎన్.వెంకటరమణ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సహాయాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వెంకటరమణ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని శ్రీ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. వెంకటరమణ కుటుంబానికి అండగా ఉంటాను అని ఆయన చెప్పారు.
భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు నివారించడంతో వెంకటరమణ కుటుంబ సభ్యులకు స్వయంగా కలవలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసారు. ఈరోజు వెంకటరమణ కుటుంబ సభ్యులకు జనసేన ప్రతినిధులు ఆర్ధిక సహాయాన్ని అందచేస్తారని వెల్లడించారు. నిన్నటి సభ సందర్భంలో స్వల్పంగా గాయపడిన ఇద్దరికి వైద్య సహాయం అందచేస్తామని ప్రకటించారు.