‘వకీల్ సాబ్’కు పోలీసుల షాక్.. నిరాశలో ఫ్యాన్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకను జె.మీడియా ఫ్యాక్టరీ నిర్వహించాలని భావించింది. ఇందుకు యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌ను వేదికగా ఎంచుకున్నారు. ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించాలని చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం అనుమతి కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాసింది. అయితే ఇప్పటికే కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా ఎలాంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు.
ఈ క్రమంలోనే ఆ జీవో ప్రకారం వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ఈవెంట్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్ తమకు ఇచ్చిన లేఖలో పేర్కొనడం జరిగిందని, తాజా జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు కుదరవని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పోలీసుల అనుమతి లేదు కాబట్టి ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తారో లేదంటే సింపుల్‌గా అతికొద్ది మంది ప్రేక్షకుల నడుమ కానిచ్చేస్తారో వేచి చూడాలి. కాగా.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది.
ఈ ట్రైలర్ ట్రెమండ్రస్ వ్యూస్‌తో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ప్రకాశ్‌రాజ్‌కు పవన్ కౌంటర్ ఇచ్చే తీరు.. వన్ చెప్పే డైలాగ్స్.. ప్రకాశ్‌రాజ్, పవన్‌ల మధ్య వచ్చే కోర్టు సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయనడంలో సందేహం లేదు. అన్యాయంగా కేసులో బుక్కయిన ఒక అమ్మాయి.. ఎలాగైనా కేసు నుంచి బయట పడాలని ఆ అమ్మాయితో పాటు తనకు సంబంధించిన మరో ఇద్దరు అమ్మాయిలు ప్రయత్నించి విసిగి వేసారిపోయిన టైమ్‌లో పవన్ ఎంట్రీ ఇవ్వడం అద్భుతం. పవన్ ఆ ముగ్గురు అమ్మాయిలకు ఎలా అండగా నిలిచారు? ఎలా బయటకు తీసుకొచ్చారు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com