బన్నీపై పవన్ ఫ్యాన్స్ గుర్రు..!!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా క్యాంప్ హీరోలే అయినా ఓ సందర్భంలో ఇద్దరి మధ్య చెడింది. నేను చెప్పను బద్రర్ అంటూ ఓ సందర్భంలో బన్నీ చెప్పిన మాటను పవన్‌కల్యాణ్ అభిమానులు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. పవన్ అభిమానులు, బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియా యుద్దం జరిగింది. తర్వాత పవన్ రాజకీయ ప్రచారం చేస్తున్నప్పుడు బన్నీ తనకు మద్దతు తెలపడంతో పవన్ ఫ్యాన్స్ కామ్ అయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో పవన్ ఫ్యాన్స్ మరోసారి బన్నీపై ఫైర్ అవుతున్నారు. అందుకు కారణణమేంటి?
వివరాల్లోకెళ్లే.. ఏప్రిల్ 8న బన్నీతో పాటు అఖిల్ అక్కినేని, పవన్ తనయుడు అకీరా పుట్టినరోజు. అఖిల్‌కు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు చెప్పిన బన్నీ.. అకీరాకు అభినందనలు చెప్పలేదట. దాంతో అఖిల్ గుర్తున్నాడు కానీ బన్నీ అకీరా గుర్తులేడా? అంటూ బన్నీపై విరుచుకుపడుతున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బన్నీ మరచిపోయి ఉండొచ్చునని, ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా చేసి చూడటం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments