భర్తగా పవన్ ను ఫెయిల్ చేసినా...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాజీ భార్యామణి రేణుదేశాయ్ రీసెంట్గా ఉమెన్స్ డే సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్తగా పవన్‌కళ్యాణ్‌కు పదికి ఎన్నిమార్కులేస్తారని అడిగితే నాలుగు మార్కులే వేస్తానని చెప్పుకొచ్చింది. అదే తండ్రిగా అయితే పదికి వంద మార్కులేస్తానని చెప్పింది. అలాగే రాజకీయ నాయకుడుగా పదికి పది మార్కులేస్తానని, ఎందుకంటే రాజకీయనాయకుడుగా ఎదిగితే ప్రజలకు ఆయనేం చేస్తారో తెలియదు కానీ చాలా గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నారని చెప్పుకొచ్చింది. అంటే భర్తగా పవన్‌కళ్యాణ్‌ను రేణుదేశాయ్ ఫెయిల్ చేసినా, ఒక తండ్రిగా, పొలిటికల్ లీడర్‌గా నెంబర్ వన్ అని చెప్పేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments