ఎగ్జయిట్ అయిన పవన్ కళ్యాణ్...

  • IndiaGlitz, [Friday,August 14 2015]

గోపాల గోపాల' చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్ధార్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని పవర్' ఫేమ్ బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. శరత్ మరార్ నిర్మాతగా రూపొందుతోంది. ఈ చిత్రంలోకాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుందని టాక్.

రేపు అంటే ఈరోజు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సర్ధార్ టీజర్ ను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ తెలియజేశారు. అయితే ఈ టీజర్ ను అల్రెడీ పవన్ చూసేశాడట. చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాడని దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మరి అభిమానులు ఎలా ఎగ్జయిట్ అవుతారో వేచి చూద్దాం..