షాకింగ్: రాజకీయాల్లోకి పవన్ మాజీ భార్య రేణుదేశాయ్..!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఇప్పటికే సినిమాలతో పాటు పలురంగాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించిన రేణు.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. అసలు ఆమె గోల్ ఏంటి..? ఆమెను రాజకీయాల్లోకి ఎవరు తీసుకురావాలనుకుంటున్నారు..? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్-రేణుదేశాయ్ ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయిన విషయం విదితమే. నాటి నుంచి నేటి వరకు ఇద్దరూ ఒకరికొకరు ఎదురొచ్చింది లేదు.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అప్పుడప్పుడు రేణు కుమారుడు, కుమార్తె ఇద్దరూ హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి వచ్చి పోతూ ఉంటారు. అంతే. అయితే ఈ మధ్య ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఆమె అభిమానులకు ఒకింత శుభవార్తే అయినప్పటికీ తాజాగా వచ్చిన ఓ వార్త పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారట.
పవన్ అంటే ఇప్పుడు అటు టీడీపీ అధిపతి, సీఎం చంద్రబాబుకు.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అస్సలు పడట్లేదు. వీరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత కాదు కదా.. అదికాస్త యుద్ధం దాకా చేరే పరిస్థితులున్నాయ్. అలాంటిది ఒక్కసారిగా రేణుదేశాయ్.. జగన్ సొంత చానెల్ అయిన సాక్షి టీవీ మైక్ పట్టుకుని దర్శనమివ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట. అంతేకాదు ఆమె ప్రస్తుతం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న కర్నూలు జిల్లాలోనే పర్యటిస్తుండటంతో కచ్చితంగా జనసేనకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు అంతా అనుకున్నట్లు జరిగితే పవన్ ఎక్కడ పోటీచేస్తే అక్కడ ఆయనపైనే పోటీ చేయించాలని వైసీపీ భావిస్తున్నారట. పవన్ పై రేణును పోటీచేయించి దెబ్బతీయాలని వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
కాగా ప్రస్తుతం.. సాక్షి టీవీ తరఫున యాంకర్‌గా రంగంలోకి దిగిన రేణుదేశాయ్ "మట్టి మనుషులు" అనే ప్రోగ్రామ్‌కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్నారు. అయితే రేణునే ఈ ప్రోగ్రామ్‌కు ఎందుకు ఎంచుకున్నారు..? ఎంచుకున్నారు సరే పవన్ పర్యటనలో ఉన్నప్పుడే కర్నూల్లోనే ఎందుకు ప్రోగ్రామ్ అంటూ హడావుడి మొదలుపెట్టారు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. సో మొత్తానికి చూస్తే పవన్‌పై ఆయన మాజీ భార్యనే అస్త్రశస్త్రంగా వాడుతున్నారన్న మాట. అయితే ఇందులో నిజానిజాలెంత..? ఆమె ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగానే పరిమితమవుతారా..? పోటీకూడా చేస్తారా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout