Pawan Kalyan : జనసైనికుల బీమా కోసం పవన్ రూ.కోటి విరాళం.. వరుసగా మూడో ఏడాది

  • IndiaGlitz, [Wednesday,February 22 2023]

ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. పార్టీని నడిపేందుకే సినిమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అటు అభిమానులు, కార్యకర్తలు సైతం తమ జేబుల్లోంచి ఎంతో కొంత తీసి పవన్‌కు బాసటగా నిలుస్తున్నారు. తన కోసం .. పార్టీ పటిష్టత కోసం ఎంతో చేస్తూ.. ప్రభుత్వంపై పోరాడుతున్న కార్యకర్తలకు పవన్ సైతం అండగా వుంటున్నారు. జనసేన క్రీయాశీలక కార్యకర్తల కోసం ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తూ కార్యకర్త మరణించినా, అంగవైకల్యం బారిన పడినా వారిని, వారి కుటుంబాలకు అండగా వుండేందుకు బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చారు పవన్. జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలను పార్టీ తరపున అందిస్తున్నారు.

సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్లాలన్న పవన్:

తాజాగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పవన్ కల్యాణ్ బుధవారం రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.కోటి చెక్‌ను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కోశాధికారి ఏవీ రత్నంలకు పవన్ అందజేశారు. అనంతరం జనసేన అధినేత మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్పూర్తిని కొనసాగించాలని పవన్ ఆకాంక్షించారు.

వరుసగా మూడోసారి పవన్ విరాళం:

ఇకపోతే.. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు , వారికి ప్రమాద బీమా చేయించేందుకు గడిచిన రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ ఏటా రూ.కోటి విరాళం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడో ఏడాది కూడా తన వంతు విరాళాన్ని అందజేశారు.

More News

Prudhvi Raj:ఉగాది నాడు జనసేనలోకి 30 ఇయర్స్ పృథ్వీ.. పవన్ సమక్షంలో చేరిక,‘‘ఎమ్మెల్యే ’’గా బరిలోకి

థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌తో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్‌ చేశాడు పృథ్వీరాజ్.

Prabhu Ganesan : సీనియర్ నటుడు ప్రభుకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు, ఆందోళనలో ఫ్యాన్స్

కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Puli Meka:‘పులి మేక’ వంటి ఎంగేజింగ్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది - డైరెక్ట‌ర్ బాబీ

ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో

APTA: ఎన్ఆర్ఐ సంస్థ ఏపీటీఏ సలహాదారుగా రవణం స్వామి నాయుడు.. !!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డపైకి ప్రతి ఏటా వేలాది మంది భారతీయులు వెళ్తూ వుంటారు.

Kasthuri :గృహలక్షీ తులసికి ప్రాణాంతక వ్యాధి.. ఆల్రెడి శరీరమంతా పాకేసిందిగా, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కస్తూరి

టాలీవుడ్ టూ కోలీవుడ్ ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా హీరోయిన్ల ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు.