పవన్.. ఆ రెండు ఒకేలా..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరిది. పవన్ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. విడుదల రోజు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఫలితాలతో సంబంధం లేకుండా అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న పవన్.. తన తాజా చిత్రం అజ్ఞాతవాసితో 25 చిత్రాల మైలురాయికి చేరకుంటున్నారు.
ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్ తొలి చిత్రం విషయంలోనూ, 25వ చిత్రంలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. పవన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 'అ' అనే అక్షరంతో మొదలైతే.. 25వ చిత్రం అజ్ఞాతవాసి కూడా అదే 'అ' అక్షరంతో ప్రారంభమవ్వడం.
ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయమే అయినప్పటికీ.. తొలి, 25వ చిత్రం విషయంలో ఒకేలా మొదటి అక్షరం ఉండడం విశేషంగానే చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com