పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది.
రీసెంట్ గా ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. 29 గంటల్లోనే సినిమా తొమ్మిది లక్షల క్లిక్స్ ను పొంది టాలీవడ్ ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. అభిమానులు ఈ సినిమాపై ఎంత ఆసక్తిగా ఉన్నారో టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments