బాహుబలికి పవర్ స్టార్ అభినందనలు...

  • IndiaGlitz, [Monday,May 08 2017]

1000 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ప్ర‌పంచ సినిమాలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబ‌లి. ఈ విజువ‌ల్ వండ‌ర్‌ను ఇప్పుడు అంద‌రూ కొనియాడుతున్నారు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో సంబంధం లేకుండా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న ఈ సినిమాను ప్ర‌శంసించే వారి జాబితాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా చేరాడు.

రాజ‌మౌళి, ప్ర‌భాస్ స‌హా టీం, ఇంత గొప్ప విజ‌యాన్ని అందుకున్నందుకు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌ల‌ను తెలియజేస్తున్నాను. ఐదేళ్ళ రాజ‌మౌళి కృషి, అంకిత‌భావం మ‌నం అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింది. ఆయ‌న ఇలాంటి విజ‌యాల‌ను మ‌రెన్నింటినో అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. రానా ద‌గ్గుబాటి, ఇత‌ర న‌టీన‌టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కు నా అభినంద‌న‌లు అని తెలిపారు.