ఎస్పీవై రెడ్డి మరణం బాధాకరం: జనసేనాని

  • IndiaGlitz, [Wednesday,May 01 2019]

నంద్యాల ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ తరఫున ఓ ప్రకటన విడుదల చేసింది. లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎస్పీవై రెడ్డి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా తరఫున, జన సైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడు రెడ్డి.. విద్యావంతుడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ఆయన పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలు సాధించడం, సామాజిక సేవలో నిమగ్నమైన తీరు, కరవు ప్రాంతాల్లో ప్రజలకు అందించిన చేయూత ఎన్నదగినవి.

రాజకీయాల్లోకి రాకముందే పేదల ఆకలి తీరేలా రెండు రూపాయలకే ఆహారం అందించే కేంద్రాలు నెలకొల్పిన రెడ్డి గారు మూడు దఫాలు లోక్ సభ సభ్యుడిగా నిరుపమానమైన సేవలందించారు. జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు రెడ్డి అనుభవం, సేవాతత్పరత సమాజానికి ఎంతో దోహదపడుతాయని మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. నంద్యాల లోక్ సభ స్థానం నుంచి పోటీకి నిలిపాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే వారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. రెడ్డి గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

More News

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇకలేరు...

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు.

అతి త్వరలో పవన్‌ను సీఎంగా చూడబోతున్నాం!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అతి త‌ర్వలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడ‌బోతున్నామని పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం స్పష్టం చేశారు

తమ్ముడి గురించి టెన్షన్ పడ్డా..: నాగబాబు

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గొప్ప విజ‌న్ ఉన్న నాయ‌కులు చాలా అరుదుగా ఉంటారని..

రామ్‌గోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ

 లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రదర్శనలు అనుమతించొద్దు

ఎవరితో సినిమా తీయాలో నాకు తెలుసు.. ఎందుకు ఫాలో అవుతున్నావ్!

‘ఆర్ఎక్స్ 100’ లాంటి బుల్లెట్ లాంటి సినిమాను గురి తప్పకుండా షూట్ చేసి.. టాలీవుడ్‌లో సింగిల్ సినిమాతో తన సత్తా చాటి చూపించిన దర్శకుడు అజయ్ భూపతి.