జైట్లీ మరణం బాధాకరం.. జనసేనాని
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. జైట్లీ మరణం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రత్యేక ఆర్ధిక మండళ్ల చట్టం రూపకల్పనలో జైట్లీ కీలకంగా వ్యవహరించారు.
విద్యార్థి నాయకుడిగా ఎమర్జెన్సీ కాలంలో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి 19 నెలలపాటు జైలు జీవితాన్ని గడిపిన జైట్లీ గారిలో సంస్కరణాభిలాష మెండుగా కనిపించేది. న్యాయవాదిగా, కేంద్ర మంత్రిగా ఆయన సేవలు మరువలేనివి. పలు ఆర్ధిక, న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జైట్లీ గారి కుటుంబానికి నా తరఫున, జన సైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను’ అని జనసేనాని ఓ ప్రకటనలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout